అమ్మంటే జాలి...., అమ్మంటే కరుణ.... చేసే పొరపాట్లు సరిద్దిదుతూ... తప్పులు మన్నించే ప్రత్యక్ష దైవం. ఈ లక్షణాలకు నిలువెత్తు రూపమే... పద్మావతి. కన్నబిడ్డ మానసిక వికలాంగుడని ఎప్పుడూ ఆలోచించలేదు. కుంగిపోలేదు. అలాంటి లోపం ఉన్న వారంతా తన పిల్లలే అనుకుంది పద్మావతి దేవి.
కడప ఎర్రముక్కపల్లెకు చెందిన పద్మావతి దేవికి విభిన్న ప్రతిభావంతుడైన కుమారుడు పుట్టాడు. అప్పటి నుంచి కంటికిరెప్పలా అతన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడు అతని వయసు 30 ఏళ్లు. తన బిడ్డలా లోపం ఉన్న మరికొందర్ని అక్కున చేర్చుకున్నారీమె. వాళ్లందర్నీ 15 ఏళ్లగా కన్నబిడ్డల్లా చూసుకుంటుంది.
2004న పద్మావతి మానసిక వికలాంగుల కేంద్రాన్ని ప్రారంభించారు. తన బిడ్డతోపాటు 10 మంది పిల్లలను సాకుతున్నారు. వీరికి స్నానం నుంచి భోజనం వరకు అన్నీ తానై దగ్గరుండి చూసుకుంటున్నారు. భోజనం చేయలేనివారికి ముద్దలు కలిపి మరీ పెడుతుంది. వారికి ఏ కష్టమొచ్చినా తట్టుకోలేదీ కరుణామూర్తి...
మనసున్న ప్రతి మహిళా అమ్మే కదా... కన్నతల్లే కదా... - పద్మావతీ
కుమారుడు విభిన్న ప్రతిభావంతుడిగా పుట్టాడని శాపంగా భావించలేదామె. అలాంటి వారిని మరికొందర్ని అక్కున చేర్చుకొని ఆదర్శంగా నిలిచారు. వారి ఆలనాపాలనా చూసుకొని... అమ్మ ప్రేమలోని కమ్మదనాన్ని చాటుతున్నారు.
మనసున్న ప్రతి మహిళా అమ్మే కదా... కన్నతల్లే కదా...
ఇవీ చదవండి..
Last Updated : May 12, 2019, 10:33 AM IST