Mother kills daughter : నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి జన్మనిచ్చిన ఆ తల్లే.. బిడ్డ ప్రాణం తీసింది. తొమ్మిదేళ్ల పాటు అల్లారుముద్దుగా పెంచిన ఆ తల్లే.. కర్కశంగా కడతేర్చింది. నిద్రిస్తున్న బాలిక గొంతు కోసి హతమార్చిన సంఘటన కడప జిల్లా పెండ్లిమర్రి మండలం కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ వార్త తెలిసి స్థానికులు ఉలిక్కిపడ్డారు.
పెంచిన చేతులే తుంచేశాయి.. కన్నతల్లి చేతిలో బాలిక హతం - kadapa crime news
mother kills daughter : కడప జిల్లాలో ఘోరం జరిగింది. ఓ మహిళ తన కూతురును కడతేర్చింది. నిద్రిస్తున్న సమయంలో గొంతు కోసి హతమార్చడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. కన్నతల్లి ఈ దారుణానికి ఒడిగట్టేందుకు కారణమేమిటంటే..
కడప జిల్లా పెండ్లిమర్రి మండలం యం.కొత్తపేట గ్రామంలో శీలంశెట్టి శివలక్ష్మి(9)ని కన్నతల్లి రాధ గొంతు కోసి చంపింది. అయితే రాధకు గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదని గ్రామస్థులు అంటున్నారు. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో తన భార్య పిచ్చిగా ప్రవర్తిస్తోంచేదని భర్త సుబ్బారాయుడు వెల్లడించాడు. ఎవరూ ఊహించని ఈ దారుణ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సీఐ సత్యబాబు, ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి సిబ్బందితో గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి రాధను విచారిస్తున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఇవీ చదవండి :