కడప జిల్లా యర్రగుంట్ల మండలం వెంకన్నగారిపల్లెలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించి భార్య, పిల్లల్ని వేధిస్తున్నాడన్న కారణంతో అల్లుడిని అత్త హతమార్చింది. వెంకన్నగారిపల్లెకు చెందినన రమేష్... మద్యం సేవించి తన భార్య అంజమ్మ, కుమార్తె అనూషను నిత్యం వేధిస్తున్నాడు. దీనితో అత్త పెద్దక్క ఆగ్రహం చెంది అతడ్ని హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. గొడ్డలి వెనుక భాగంతో తలపై బాదటంతో తీవ్రంగా గాయపడ్డ రమేష్‌ను ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు
భార్య, పిల్లలకు చిత్రహింసలు.. అల్లుడిని చంపిన అత్త - madhyam
మద్యం సేవించి భార్య, పిల్లలను వేధిస్తున్న అల్లుడిని హతమార్చింది ఓ అత్త. కడప జిల్లా యర్రగుంట్ల మండలం వెంకన్నగారిపల్లెలో ఈ ఘటన జరిగింది.
అల్లుడిని చంపిన అత్త...