కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం(యోవేవి) జీవ వైవిధ్యానికి అనుకూల వాతావరణం ఉండడంతో రకరకాల జీవులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇటీవల అరుదైన కీటకం జంపింగ్ స్పైడర్ గుర్తించగా, తాజాగా అతిపెద్ద ఉడుము కనిపించింది. విశ్వవిద్యాలయం ప్రధానాచార్యుల కార్యాలయ ప్రాంగణంలోని ఓ గదిలో 10 కిలోల బరువు, 4 అడుగుల పొడవున్న ఉడుమును గుర్తించారు. దాన్ని విశ్వవిద్యాలయ బొటానికల్ గార్డెన్ కోఆర్డినేటర్ మధుసూదన్‌రెడ్డికి అప్పగించారు. 20 సంవత్సరాల వయసున్న ఆ ప్రాణిని ఉద్యానవనంలో వదిలేశారు.
Vemana University: వేమన వర్సిటీలో 4 అడుగుల ఉడుము - అతిపెద్ద ఉడుము వార్తలు
కడప జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీలోని.. ప్రధానాచార్యుల కార్యాలయ ప్రాంగణంలో ఉడుమును గుర్తించారు. అది 10 కిలోల బరువు, 4 అడుగుల పొడవుందని అధికారులు తెలిపారు.
వేమన వర్సిటీలో అతిపెద్ద ఉడుము