స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం పోలీసులు తనిఖీలు చేపట్టగా, ఓ వాహనంలో బిల్లులు లేని 4 లక్షల 80 వేల నగదను స్వాధీనం చేసుకొన్నారు. నగదు తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
తలమంచిపట్నంలో బిల్లులు లేని 4 లక్షల 80 వేల నగదు స్వాధీనం - తలమంచిపట్నంలో బిల్లులు లేని నగదు స్వాధీనం
స్థానిక ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున నగదు రవాణా జరుగుతుంది. ఇటువంటివి జరగకుండా పోలీసులు ఎక్కడకక్కడ వాహన తనిఖీలు చేస్తున్నా మార్పు రావటం లేదు. కడప జిల్లా తలమంచిపట్నం పోలీసుల దాడుల్లో దొరికిన నగదే ఇందుకు ఉదాహరణ.
![తలమంచిపట్నంలో బిల్లులు లేని 4 లక్షల 80 వేల నగదు స్వాధీనం money caught by thalamanchipatnam police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6364419-1058-6364419-1583870671090.jpg)
తలమంచిపట్నంలో బిల్లులు లేని 4 లక్షల 80 వేల నగదు స్వాధీనం
తలమంచిపట్నంలో బిల్లులు లేని 4 లక్షల 80 వేల నగదు స్వాధీనం
జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 100 మందిని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేసినట్లు డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే, కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.
ఇదీ చదవండి:బీటెక్ రవికి పులివెందుల తెదేపా బాధ్యతలు