ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నేతల తీరు దారుణం: బీటెక్ రవి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గంలో 80 స్థానాలను ఏకగ్రీవం చేశారని.. అదే తరహాలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కూడా ఏకగ్రీవాలు చేయాలని ప్రయత్నాలు చేయడం దారుణమని తెదేపా నేత బీటెక్ రవి విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నాయకులు అనుసరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని ఆరోపించారు.

mlc ravi complaint to sp  AnbuRajan  over ysrcp leaders attack on sarpanch elections candidates
mlc ravi complaint to sp AnbuRajan over ysrcp leaders attack on sarpanch elections candidates

By

Published : Feb 15, 2021, 8:02 PM IST

ఈ నెల 21న పులివెందుల నియోజకవర్గంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన తేదేపా అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కోరుతూ కడప ఎస్పీ అన్బురాజన్​కు తెదేపా నేత బీటెక్ రవి వినతిపత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మరింత దారుణంగా ఉందని పేర్కొన్నారు. నామినేషన్ వేసిన తెదేపా మద్దతుదారులను పోలీసులు అనవసరమైన కేసుల్లో ఇరికించి పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లారని తెలిపారు. పోలీస్ స్టేషన్​కు వెళితే.. అభ్యర్థి అనే విషయం తమకు తెలియదని మాట్లాడుతున్నారని బీటెక్ రవి పేర్కొన్నారు. వైకాపా నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోందని.. అభ్యర్థులకు రక్షణ కల్పించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేశారనే కోపంతో వైకాపా నాయకులు అభ్యర్థుల పంట పొలాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details