శవరాజకీయాలు జగన్‌కు కొత్తకాదు: బుద్దా - budha venkanna
శవరాజకీయాలు చేయడం వైకాపా అధినేత జగన్‌కు కొత్త కాదని... చిన్నాన్న మరణాన్ని కూడా జగన్ రాజకీయాలకు వాడుకుంటున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు.
వివేకా చనిపోయారని తెలియగానే...లోటస్‌పాండ్ నుంచి తెలంగాణ పోలీసులతో జగన్ మంతనాలు జరిపారని ఆరోపించారు. హత్యపైతెలంగాణ పోలీసులతోనే దర్యాప్తు చేయించే ఉద్దేశంతో జగన్ ఉన్నారని దుయ్యబట్టారు.వైఎస్ వివేకాను కుటుంబంలోని వ్యక్తే హత్య చేయించారని ఆరోపణలు వస్తున్నాయన్న బుద్దా... జగన్ కుటుంబంతో తప్ప వివేకానందరెడ్డికి ఎవరితో గొడవలు లేవని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్యపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. హత్య చేసి సానుభూతి సంపాదించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సొంత చిన్నాన్న చనిపోతే... జగన్ తాపీగా లోటస్‌పాండ్‌లోనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో వైఎస్ చనిపోయినప్పుడూ జగన్ఇలాగే చేశారన్న బుద్దా... ఎన్నికల్లో సానుభూతి కోసం ప్రతిపక్ష నేత ఏమైనా చేస్తారన్నారు.చంద్రబాబు పాలనలో కడప జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలు ఆగిపోయిన విషయం గుర్తుచేశారు.