ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అసలు దోషులను వదిలేయాలని చూస్తున్నారా?: బీటెక్ రవి - కడప పేలుళ్లపై మాట్లాడిన బీటెక్ రవి

కడప జిల్లా ముగ్గురాయి పేలుడు ఘటనలో అసలు దోషులను వదిలేయాలని చూస్తున్నారా అంటూ.. తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రశ్నించారు. అసలు లీజుదారుగా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య సతీమణి పేరు ఉందని ఆయన ఆరోపించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బీటెక్ రవి
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బీటెక్ రవి

By

Published : May 12, 2021, 4:04 PM IST

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బీటెక్ రవి

కడప జిల్లా ముగ్గురాయి గనుల వద్ద పేలుడు ఘటనలో అసలు దోషులను వదిలేయాలని చూస్తున్నారా అంటూ... ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రశ్నించారు. అసలు లీజుదారుగా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య సతీమణి పేరు ఉందని ఆయన ఆరోపించారు. 2001 నుంచి 2022 వరకు లీజు పరిమితి కస్తూరిబాయి పేరుతోనే ఉందని గుర్తు చేశారు. నాగేశ్వర్‌రెడ్డిపై చాలా కేసులున్నాయన్నారు.

ఆయనకు సబ్ లీజుకు ఇచ్చారా లేక ఇచ్చినట్లు పత్రాలు సృష్టించారా అంటూ నిలదీశారు. రామచంద్రయ్య కుటుంబసభ్యుల జోలికి వెళ్లొద్దని ఆదేశాలొచ్చాయా అని ప్రశ్నించారు. పేలుళ్ల ఘటనకు సి.రామచంద్రయ్య, ఆయన సతీమణే కారణమంటూ స్పష్టం చేశారు. ఘటనపై చర్యలు తీసుకోకుంటే.. తెదేపా తరఫున కోర్టులో ప్రైవేటు కేసు వేస్తామని బీటెక్ రవి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details