తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆదుకోవాలని,కనీసం రూ.పది వేలు ఇవ్వాలని సింహాద్రిపురం తహసీల్దార్‌కు ఎమ్మెల్సీ బీటెక్ రవి వినతి ప్రతం అందజేశారు. కరోనా మరణాల్లో ప్రభుత్వం తప్పడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు.చంద్రన్న బీమాను ప్రభుత్వం రద్దు చేయడం కారణంగా ప్రస్తుతం కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు ఒక్కపైసా సాయం అందలేదన్నారు. కరోనాతో చనిపోయిన వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు.
'తెల్లరేషన్ కార్డు కలిగిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి' - సింహాద్రిపురం తాజా సమాచారం
తెల్లరేషన్ కార్డు కలిగిన వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ బీటెక్ రవి డిమాండ్ చేశారు. ఆ మేరకు కడప జిల్లా సింహాద్రిపురం తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. కరోనాతో చనిపోయిన ప్రతి ఒక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలన్నారు.
సింహాద్రిపురం తహసీల్దార్‌కు ఎమ్మెల్సీ బీటెక్ రవి వినతి ప్రతం