ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'న్యాయ విచారణ జరిపిస్తే నిజాలు బయటకొస్తాయి' - mla sudheer reddy news

కడప జిల్లా జమ్మలమడుగులో వైకాపా, తెదేపా నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార పార్టీ కార్యకర్త గురుప్రతాప్ రెడ్డి హత్య విషయంలో ఈ వివాదం రాజుకుంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి​పై ఘాటు విమర్శలు చేశారు ఎమ్మెల్సీ బీటెక్ రవి.

mlc b tech ravi
mlc b tech ravi

By

Published : Dec 20, 2020, 8:38 PM IST

ఓట్లేసిన ప్రజలనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి దుయ్యబట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చాక సుధీర్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆదివారం జమ్మలమడుగు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

గండికోట జలాశయం పరిహారం విషయంలో పలువురు నాయకుల నుంచి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పెద్ద ఎత్తున కమీషన్లు తీసుకున్నారు. కొండాపురం మండలం పి.అనంతపురంలో గురు ప్రతాప్ రెడ్డి హత్యకు ప్రణాళిక వేసింది వైకాపా వర్గీయులే. న్యాయ విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటే సీఎం జగన్ అసహ్యించుకుంటారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్​ వచ్చే పరిస్థితి లేదు. సింగల్ టైం ఎమ్మెల్యేగా సుధీర్ మిగిలిపోతారు.ఇక్కడ సంపాదించిన అవినీతి సొమ్ముతో విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఆయన భారీగా స్థలాలు కొంటున్నారు- బీటెక్ రవి, ఎమ్మెల్సీ

ABOUT THE AUTHOR

...view details