ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జమ్మలమడుగు నియోజకవర్గ అభివృద్ధికి రూ. 20 కోట్లు ఇవ్వండి' - jammalamadugu mla sudheer reddy

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ అభివృద్ధికి 20 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణను కోరారు. అలాగే మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

mla sudheer reddy asks funds to jammalamadugu constituency development
మంత్రి బొత్సను కలిసిన జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

By

Published : Jun 18, 2020, 5:12 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ అభివృద్ధికి 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణను కోరారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్సను కలిసి జమ్మలమడుగు అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గంలో జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలు ఉన్నాయని.. ఒక్కో దానికి 10 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయాలని అడిగారు. పట్టణ ప్రజలు కోరుకున్న విధంగా పార్కును, ఇంకా అభివృద్ధి పనులకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించి నిధులు మంజూరు చేయాలన్నారు. మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details