ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కౌలురైతులకూ వైఎస్సార్ రైతు భరోసా, ఇన్సూరెన్సు వర్తిస్తుంది' - latest news of mla sudder reedy

కడప జిల్లా ఉప్పలపాడు గ్రామంలో కౌలురైతులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పత్రాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తోడ్పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

mla sudder reddy distributes cards to rent farmers in kadapa dst
mla sudder reddy distributes cards to rent farmers in kadapa dst

By

Published : Jul 21, 2020, 11:59 AM IST

సాధారణ రైతుల మాదిరిగానే కౌలురైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా, ఇన్సూరెన్సు వర్తిస్తుందని ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి తెలిపారు. కడప జిల్లా ఉప్పలపాడు గ్రామంలో కౌలురైతులకు ఎమ్మెల్యే పత్రాలు అందించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిచడమే కాకుండా, దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రతి రైతు తను వేసిన పంటలకు ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని అన్నారు. త్వరలోనే రైతు భరోసా కేంద్రాలలో రైతులకు కావలసిన అన్నిరకాల ఎరువులను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నదని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details