ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్యాంకు నిర్మాణాన్ని అడ్డుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే - ప్రొద్దుటూరు ఎమ్మెల్యే

గత ప్రభుత్వ సమయంలో చేపట్టిన ప్రొద్దుటూరు గాంధీపార్కు మంచినీటి ట్యాంకు నిర్మాణాన్ని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అడ్డుకున్నారు. ప్రజలకు ఉపయోగపడే పార్కును నిరుపయోగం చేశారని ఆరోపించారు.

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి

By

Published : May 28, 2019, 8:31 PM IST

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి

కడప జిల్లా ప్రొద్దుటూరు గాంధీపార్కులో గత ప్రభుత్వం చేపట్టిన మంచినీటి ట్యాంకు నిర్మాణ గుంతను పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పూడ్చి వేయించారు. పురపాలిక కౌన్సిల్ తీర్మానం లేకుండా ప్రజలకు ఉపయోగపడే పార్కులో అక్రమంగా ట్యాంకు నిర్మాణాన్ని చేపట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ విషయాన్ని అధికారులతో మాట్లాడి...ట్యాంకు కోసం తవ్విన గుంతను పూడ్చివేయిస్తున్నామని తెలిపారు. అలాగే తెదేపా నేతలు కూల్చివేయించిన పాత బస్టాండ్​ బస్ షెల్టర్​ను.. వచ్చే నెల ఒకటిన పునర్నిర్మాణ పనులు చేపడతామని ఎమ్మెల్యే అన్నారు. రెండు నెలల వ్యవధిలోనే బస్ షెల్టర్ నిర్మిస్తామని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధిలో భాగంగానే ఈ పనులు చేస్తున్నామన్న ఎమ్మెల్యే... తెదేపా నాయకులు తమతో కలిసి రావాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details