కడప జిల్లా రైల్వే కోడూరులో.. ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పుట్టినరోజు వేడుకలు అభిమానులు, వైకాపా కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో సచివాలయ భవనాల నిర్మాణానికి ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.
పట్టణంలోని టోల్ గేట్ వద్ద భారీ కేక్ కట్ చేశారు. బొజ్జవారిపల్లి, వివి. కండ్రిక, వై కోట గ్రామాల్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కేక్ కట్చేసి, శుభాకాంక్షలు తెలిపారు. బొజ్జవారిపల్లిలో వైకాపా నాయకులు అన్నదానం చేశారు.