కడప జిల్లా రాయచోటిలో జరిగిన పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్ ప్రారంభించారు. పట్టణంలోని వీరభద్రస్వామి ఆలయానికి రూ.1.50కోట్లతో నిర్మించనున్న గాలిగోపురం నిర్మాణానికి భూమిపూజ చేశారు. నేతాజీ కూడలిలో ఏర్పాటు చేసిన నేతాజీ విగ్రహాన్ని ప్రారంభించారు. రాయచోటి పురపాలక అభివృద్ధికి రూ.350 కోట్లతో తాగునీరుతో పాటు డ్రైనేజీ పార్కులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జకియా ఖానం పాల్గొన్నారు.
రాయచోటిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం - గడికోట శ్రీకాంత్ రెడ్డి
రాయచోటిలో పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ జకియా ఖానం పాల్గొన్నారు.
MLA Srikanth Reddy