ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కమలాపురంలో వాలంటీర్లను సత్కరించిన ఎమ్మెల్యే - ఈరోజు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తాజా వ్యాఖ్యలు

సుమారు 1033 మంది వాలంటీర్లను కడప జిల్లా కమలాపురం మండలంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొని.. వాలంటీర్లకు అవార్డులు అందజేశారు.

MLA ravindranath reddy
వాలంటీర్లను సత్కరించిన ఎమ్మెల్యే

By

Published : Apr 18, 2021, 7:03 PM IST

కడప జిల్లా కమలాపురం మండల పరిషత్ అభివృద్ది కార్యాలయంలో వాలంటీర్లను ఘనంగా సన్మానించారు. మండలంలోని సుమారు 1033 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతీ పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడానికి సీఎం జగన్​.. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గౌతమి, స్పెషల్ ఆఫీసర్ చిన్నరాముడు, అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్​ పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details