ఏలూరులో జరిగిన ఘటనలో తనపై ఆరోపణలు చేయడం దారుణమని కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నాసిరకం క్లోరిన్ సరఫరా చేస్తున్నట్లు తెదేపా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో క్లోరిన్ సరఫరాకు ఇతర కాంట్రాక్టర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. కేవలం ముఖ్యమంత్రి మేనమామ అనే ఉద్దేశంతోనే తనను టార్గెట్ చేశారని అన్నారు.
'ఏలూరు ఘటనకు.. నాకు సంబంధం లేదు' - తెదేపాపై ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం
ఏలూరులో జరిగిన ఘటనలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. తనపై తప్పుగా ప్రచారం చేస్తున్న వారిపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
mla ravindra nadh reddy on eluru incident
తనపై తప్పుగా ప్రచారం చేస్తున్న వారిపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. కడప జిల్లా పోలీసులకు, ఇంటెలిజెన్స్ నిఘా విభాగానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.