ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి - raghuramireddy latest news

ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమానికి తెదేపా నాయకులు అడ్డంకులు కలిగిస్తున్నారని కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

mla raghuramireddy press meet at maydukur in kadapa district
పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

By

Published : Sep 23, 2020, 6:38 PM IST

ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో తెదేపా అనుసరిస్తున్న వ్యతిరేక ధోరణి మార్చుకోవాలని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హితవు పలికారు. కడప జిల్లా మైదుకూరు ఎంపీడీవో కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా చంద్రబాబుకు పట్టడం లేదని, హైదరాబాద్​లో కూర్చుని పత్రికల్లో విమర్శలు చేస్తున్నారే తప్పా... ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకోలేదని విమర్శించారు.

బాబు పద్ధతులు నచ్చకే ఎర్రన్నాయుడు కుమార్తె, రాజమండ్రి తెదేపా ఎమ్మెల్యే వైకాపాలో చేరబోతున్నట్లు తెలిపారు. ఆమె వైకాపాలో చేరితే అచ్చెన్నాయుడు కూడా పోతారనే భయంతోనే పార్టీ అధ్యక్ష పదవి ఎరగా వేశారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా నా రక్తం తాగారు'

ABOUT THE AUTHOR

...view details