జులై 8న పురపాలికలోని 2600 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నట్లు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కడపలో తెలిపారు. రహదారుల అభివృద్ధి, విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వమే పక్కాగృహాలు నిర్మించి ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. రూ. 86 కోట్లతో ఇంటింటికి నల్లా వేసేలా పనులు చేపట్టేందుకు గుత్తేదారు ముందుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఏడాదిలోగా శుద్ధి చేసిన నీరు సరఫరా చేస్తామన్నారు.
'అభివృద్ధే లక్ష్యంగా సీఎం పాలన' - mla raghuramireddy latest news
కడప జిల్లా మైదుకూరులోని మురుగుకాల్వను అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పలు అంశాలపై మాట్లాడిన ఆయన ఆక్రమణలను తొలగించి అభివృద్ధి చేసేలా ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డితో చర్చించినట్లు తెలిపారు.
cm jagan