వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరులో మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని ఉద్దేశించి ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'కామనూరులో పలుమార్లు రిగ్గింగ్ జరిగింది. ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అనేకసార్లు చంపేశారు' అని ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యానించారు. వరదరాజుల రెడ్డి స్వగ్రామం కామనూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.. ఈ వ్యాఖ్యలు చేశారు.
కామనూరులో ఎమ్మెల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.. - ఎమ్మెల్యే రాచమల్లు రాకతో కామనూరులో ఉద్రిక్తత
Rachamallu Siva Prasad Reddy: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిపై వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారి తీశాయి.
![కామనూరులో ఎమ్మెల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.. Rachamallu Shiva Prasad Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15382401-947-15382401-1653478596518.jpg)
ఎమ్మెల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు
ఎక్కడ, ఎప్పుడు రిగ్గింగ్ జరిగిందని వరదరాజుల రెడ్డి వర్గీయులు ప్రశ్నించడంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో వరదరాజుల రెడ్డి వర్గీయులపై ఎమ్మెల్యే రాచమల్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. కామానూరులో ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయ్యాలంటూ విజ్ఞప్తి చేయడంతోపాటు రాజకీయ గురువు వరదరాజుల రెడ్డికి హెచ్చరిక చేస్తున్నానని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: