కడప జిల్లా ప్రొద్దుటూరులో వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కుంభకోణంపై ఓ పత్రికలో ప్రచురించిన కథనాలు అవాస్తవమని.... రూ.117 కోట్ల సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల్లో తన ప్రమేయం లేదని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు.
ఆ ఆరోపణల్లో నిజం లేదు: వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు
సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కుంభకోణంలో తనపై వచ్చిన ఆరోపణలపై ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు స్పందించారు. నకిలీ చెక్కుల్లో తన ప్రమేయం లేదని ఎమ్మెల్యే రాచమల్లు స్పష్టం చేశారు.
వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు
నకిలీ చెక్కుల కుంభకోణంపై సీబీఐ విచారణ కోరేందుకు సిద్ధమని....తన ప్రమేయం ఉన్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:కేంద్రమంత్రి తోమర్‍కు తెదేపా ఎమ్మెల్సీ వైవీబీ లేఖ
Last Updated : Oct 9, 2020, 4:25 PM IST