భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై వైకాపా నాయకులు మండిపడ్డారు. రాష్ట్రానికి భాజపా చేసిందేమీ లేదని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయలేదని.. కేంద్రమే అంతా చేసిందని భాజపా నేతలు అవాస్తవాలు చెప్పడం వారికి పరిపాటిగా మారిందని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. మేము చేసిన మంచి పనులను సమాధానం చెప్పేందుకు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, భాజపా ఇందుకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. బద్వేలు ఉప ఎన్నికలో ఓట్లు అడిగే అర్హత భాజపాకు లేదని అన్నారు. ఇక్కడ ఆ పార్టీ వాళ్ల ఉనికి లేనప్పుడు ఏజెంట్లను ఎలా పెట్టుకుంటారని కాకాని ప్రశ్నించారు.
MLA Kakani Govardhan Reddy: ఎవరేం చేశారో.. బహిరంగ చర్చకు సిద్ధమా? భాజపాకు కాకాని సవాల్ - భాజపాపై ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వార్తలు
రాష్ట్రానికి భాజపా చేసిందేమీ లేదని వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి వైకాపా ఏమీ చేయలేదని.. కేంద్ర ప్రభుత్వమే అంతా చేసిందని అవాస్తవాలు చెప్పడం భాజపా నేతలకు పరిపాటి అయిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి భాజపా ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
మీరు చేసిన పనులపై బహిరంగ చర్చకు సిద్ధమా? : కాకాని గోవర్థన్ రెడ్డి