కడప జిల్లా ప్రొద్దుటూరులో 14 వేల ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రంజాన్ కానుక అందించారు . ఎమ్మెల్యే రాచమల్లు రూ. 75 లక్షల సొంత నిధులతో పేదలకు సరకులను అందించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పాల్గొన్నారు. విపత్కర పరిస్థితుల్లో ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే రాచమల్లు అండగా నిలవడంపై ఉప ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ అమలులో ఉన్నందున ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఆయన ముస్లింలకు సూచించారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు వైకాపా నాయకులు సహాయం చేస్తుంటే ....ప్రొద్దుటూరులో తెదేపా నేతలు విమర్శలు చేయడం బాధాకరమని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు.
'14వేల ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక' - ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తాజా వార్తలు
కడప జిల్లా ప్రొద్దుటూరులో 14 వేల ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రంజాన్ కానుక అందించారు. ఎమ్మెల్యే రూ. 75 లక్షలు సొంత నిధులు వెచ్చించి సమకూర్చిన సరుకులను ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అందజేశారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రంజాన్ కానుక