ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ration distribution vehicles: ఆ వాహనాలను ఇలా వాడడంపై విమర్శలు.. - Misuse of ration distribution vehicles in Kadapa district

ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కేటాయించిన రేషన్​ బియ్యం పంపిణీ వాహనాలను కొంతమంది తమ సొంత అవసరాలకు వినియోగిస్తున్నారు. కొందరు డ్రైవర్లు పబ్లిగ్గానే ఆ వాహనాలను తమ సొంత పనులకు వినియోగిస్తున్నారు. తాజాగా కడప జిల్లాలో ఓ రేషన్ పంపిణీ వాహనం సెంట్రింగ్ కొయ్యలు వేసుకుని వెళ్లటం స్థానికులు చూశారు. ప్రభుత్వ వాహనాలను సొంత పనులకు వినియోగించటంపై సర్వత్రా విమర్శలు చేస్తున్నారు.

ration distribution vehicle
ration distribution vehicle

By

Published : Oct 29, 2021, 10:17 AM IST

ఇంటింటికి రేషన్‌ బియ్యం పంపిణీ చేయాల్సిన వాహనాలను కొందరు డ్రైవర్లు తమ స్వంత అవసరాల కోసం వినియోగిస్తున్నారు. కడప జిల్లాలో ప్రొద్దుటూరు-మైదుకూరు మధ్య 67వ నెంబరు జాతీయ రహదారిపై వాహనం ఒకటి ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే సెంట్రింగ్‌ కొయ్యలు వేసుకుని వెళ్లడం కనిపించింది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వినియోగించాల్సిన వాహనాలను స్వంత అవసరాల కోసం వినియోగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి

మంత్రులు, ఎమ్మెల్యేలపై.. భాజపా నేతల ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details