కడప బీడీ కాలనీకి చెందిన దస్తగిరమ్మ (40)కు 20 ఏళ్ల కిందట వెంకటేష్‌తో వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. భర్త కొంత కాలం కిందట చనిపోయారు. అప్పటినుంచి ఆమె పిల్లలను పోషించుకుంటూ జీవించేవారు. ఆమెకు ఓ లారీ డ్రైవర్‌తో సన్నిహిత సంబంధాలు ఉండేవని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 3వ తేదీ నుంచి దస్తగిరమ్మ కనిపించకుండా పోయింది. బంధువులు చుట్టుపక్కల గాలించారు. ఎక్కడా కనిపించకపోవటంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
అదృశ్యమైన మహిళ హత్య..ముళ్లపొదల్లో మృతదేహం గుర్తింపు - కడప క్రైమ్ వార్తలు
కడప సర్వజన ఆసుపత్రి పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు కేసు నమోదు చేసి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
కడపలో అదృశ్యమైన మహిళ హత్య
సోమవారం దస్తగిరమ్మ మృతదేహాన్ని కడప శివారులోని జేఎంజే కళాశాల సమీపంలోని ముళ్లపొదల్లో గుర్తించారు. శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించామన్నారు. వీఆర్‌వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: 'న్యాయమూర్తులపై అనుచిత పోస్టింగుల వెనుక కుట్ర'