ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు అనుమానాస్పద మృతి - వేంపల్లిలో అదృశ్యమైన యువకుడు అనుమానాస్పద మృతి

డిసెంబరు 2వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన నాగేంద్ర అనే యువకుడు.. కడప జిల్లా పులివెందులలోని వేంపల్లెలో శవమై తేలాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

mystery death
మృతుడు నాగేంద్ర

By

Published : Dec 5, 2020, 4:31 PM IST

కడప జిల్లా పులివెందులలోని వేంపల్లెలో రాజీవ్ నగర్​కు చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. రాయచోటి - పులివెందుల బైపాస్ రోడ్డు సమీపంలోని ఎస్ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వెనుక.. నాగేంద్ర మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. నాగేంద్ర కనిపించడం లేదంటూ వేంపల్లె పోలీస్ స్టేషన్​లో నిన్న కేసు నమోదు కాగా.. 2వ తేదీ నుంచి అతడి జాడ లేదని బంధువులు తెలిపారు.

నాగేంద్ర మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. పోలీస్ స్టేషన్​లో బంధువులు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతికి కారణాలను వెల్లడిస్తామని.. ఎస్సై తిరుపాల్ నాయక్ మీడియాకు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details