రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రంలో తప్పిన పెనుప్రమాదం - రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం తాజా సమాచారం
కడప జిల్లాలోని రాయలసీమ తాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పెనుప్రమాదం తప్పింది. బంకర్కున్న వెల్డింగ్ ఊడిపోవడంతో.. బంకర్ తోపాటు సుమారు 700 టన్నుల బొగ్గు కిందపడింది. ప్రమాద సమయంలో కార్మికులు ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

కడప జిల్లా రాయలసీమ తాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని 600 మెగావాట్ల యూనిట్లలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. విద్యుత్ ఉత్పత్తి కోసం.. నీరు, బొగ్గు నిల్వ చేస్తున్న బంకర్‌కు వెల్డింగ్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో బంకర్‌తో పాటు సుమారు 700 టన్నుల బొగ్గు కిందపడింది. ప్రమాదం సమయంలో కార్మికులు ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో.. అధికారులు, కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఈ.. వెంటనే మరమ్మతులకు ఆదేశించారు. నిర్మాణ సమయంలో బంకర్‌కు వెల్డింగ్ సరిగ్గా చేయకపోవడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు కార్మికులు పేర్కొన్నారు.