ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రి...ఉప ముఖ్యమంత్రి..చీఫ్ విప్! - amzad basha

మొన్నటి ఎన్నికల్లో వైకాపా క్లీన్ స్వీప్ చేసిన ఒక్కటైన కడప జిల్లా నుంచి ఎమ్మెల్యే అంజాద్ బాషా... జగన్ జట్టులో చోటు సంపాదించారు. ఆయనతో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమితులయ్యారు.

అంజాద్ బాషా ప్రమాణస్వీకారం

By

Published : Jun 8, 2019, 3:08 PM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాకు మంత్రి వర్గంలో మరో బెర్త్ దక్కింది. కడప ఎమ్మెల్యేగా ఉన్న అంజాద్ బాషా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వైఎస్ కుటుంబానికి అత్యంత దగ్గరి వ్యక్తిగా పేరున్న అంజాద్ బాషాకు అందరూ అనుకున్నట్లే మంత్రి పదవి దక్కింది. అధినేత ప్రకటించిన 5 డిప్యూటీ సీఎంల్లో ఒకటి అంజాద్ బాషాకు దక్కే అవకాశం ఉంది.

మంత్రిగా ప్రమాణం చేసిన అంజాద్ బాషా
విధేయత..సామాజిక సమీకరణాలుతొలిసారిగా 2014లో వైకాపా నుంచి కడప అభ్యర్థిగా పోటీ చేసిన అంజాద్ బాషా...తెదేపా అభ్యర్థి దుర్గాప్రసాద్ పై విజయం సాధించారు. వైఎస్ కుటుంబపై ఎనలేని అభిమానం పెంచుకున్న అంజాద్ బాషా...జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటారన్నే పేరుంది. ఆ విధేయతతోపాటు సామాజిక సమీకరణాల మేరకు జగన్ తన తొలి జట్టులో అవకాశం కల్పించారు.దీంతో మైనారిటీలకు ప్రాధాన్యమిచ్చారన్న అభిప్రాయం కడపవాసుల్లో వ్యక్తమవుతోంది. మైనార్టీలకు డిప్యూటీ సీఎం ఇస్తామని ఆ పార్టీ అధినేత జగన్ ఇచ్చిన హామీ మేరకు...బాషాకు డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించే ఛాన్స్‌ ఉందంటున్నాయి పార్టీ వర్గాలు.చీఫ్ విప్ గా శ్రీకాంత్ రెడ్డి..ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాకు మరో పదవి దక్కింది. రాయచోటి ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి పదవి దక్కుంతుందని అందరూ భావించినా...చివరకి ఆయనకు దక్కలేదు. దీంతో ప్రభుత్వ చీఫ్ విప్ గా శ్రీకాంత్ రెడ్డిని జగన్ నియమించారు.

ABOUT THE AUTHOR

...view details