ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మన బడి నాడు-నేడు'పై మంత్రి దిశానిర్దేశం - ap minister suresh latest news in cadapa

కడప జెడ్పీ కార్యాలయంలో విద్యాశాఖ ఇంజినీర్లకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేశ్ 'మన బడి నాడు-నేడు'పై దిశానిర్దేశం చేశారు. అధికారులంతా ఉద్యమంలా పని చేయాలని పిలుపునిచ్చారు.

minister-suresh-on-manabadi-program-in-cadapa

By

Published : Oct 19, 2019, 2:03 PM IST

'మనబడి నాడు-నేడు'పై మంత్రి దిశానిర్దేశం

ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలోని 44వేల పాఠశాల, కళాశాల భవనాల రూపురేఖలు మార్చాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే అందరూ ఉద్యమంలా పని చేయాలని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పిలుపునిచ్చారు. కడప జెడ్పీ కార్యాలయంలో కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన విద్యాశాఖ ఇంజినీర్లతో నిర్వహించిన వర్క్‌షాప్‌నకు ఆయన హాజరయ్యారు. మనబడి నాడు-నేడు అనే కార్యక్రమం గురించి వారికి మార్గనిర్దేశం చేశారు. విద్యాశాఖలో సమూల మార్పులే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని... ప్రతిపక్షాలు విమర్శించే తావు లేకుండా అధికారులు పని చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details