గత ప్రభుత్వ విధానాల వల్లే విత్తనాల కొరత ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. రైతు దినోత్సవం ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమైన ఘట్టమని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించే సమయానికి 50 వేలు క్వింటాళ్లు మాత్రమే వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని.. నెల వ్యవధిలోనే మూడు లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులోకి తీసుకు వచ్చామని చెప్పారు. కడప ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు... రైతు మిషన్ వ్యవసాయంపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వేరుశనగ విత్తనాలను తీసుకొచ్చామని పేర్కొన్నారు.
రైతు దినోత్సవం చరిత్రాత్మక ఘట్టం: కన్నబాబు - farmers day
తెదేపా ప్రభుత్వ విధానాల వల్లే విత్తనాల కొరత ఏర్పడిందని మంత్రి కన్నబాబు అన్నారు. నెల వ్యవధిలోనే 3 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రైతు దినోత్సవం నిర్వహించటం చారిత్రాత్మకమైన ఘట్టమని స్పష్టం చేశారు.
రైతు దినోత్సవం చరిత్రాత్మక ఘట్టం: కన్నబాబు
కడప జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని చెప్పారు. ఆగస్టులో కడపలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు డిప్యూటీ మంత్రులు, శాస్త్రవేత్తలు హాజరవుతారని తెలిపారు. మామిడి, చీనీ చెట్ల రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. జగన్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని మంత్రి కన్నబాబు తెలిపారు.