గోదావరి వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో గోదావరి వరద బారినపడిన లంక గ్రామాల్లో నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో పడవలపై వెళ్లి పెదమల్లం లంక, అయోధ్య లంక. పుచ్చ లంక, కనకాయలంక గ్రామాలలో పర్యటించి అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామాల్లో బియ్యం, నిత్యావసర సరుకులు, మందులను అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు.
'సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండండి' - lanka villages
గోదావరి వరద బారిన పడ్డ లంక గ్రామాల్లో అత్యవసర స్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో తరలించేదుకు సిద్ధంగా ఉండాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అధికారులను ఆదేశించారు. ప.గో జిల్లా లంక గ్రామాల్లో నరసాపురం ఎంపీతో కలిసి పర్యటించి...అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.
'సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండండి'