గండికోట ప్రాజెక్టులో 26 టీఎంసీలు నిల్వ చేస్తామని మంత్రి అనిల్ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో పట్టిసీమ మినహా ఏ ప్రాజెక్టు చేశారో తెదేపా చెప్పాలని నిలదీశారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు నీటిని తరలించి సస్యశ్యామలం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణానదిపై ఇంకో రెండు బ్యారేజీలు నిర్మించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 81 శాతం ప్రాజెక్టులు నిండాయని మంత్రి అనిల్ తెలిపారు.
గండికోట ప్రాజెక్టుకు రూ.670 కోట్లు విడుదల: మంత్రి అనిల్ - గండికోట ప్రాజెక్టుపై మంత్రి అనిల్ కామెంట్స్
గండికోట ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం రూ.670 కోట్లు నిధులు విడుదల చేశామని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. రూ.10 లక్షలు పరిహారం అందజేయనున్నట్లు వెల్లడించారు.
minister anil on gandikota irrigation project