ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోళ్లమడుగు వద్ద మినీలారీ బోల్తా.. 14 మందికి గాయాలు - రోళ్లమడుగు తాజా వార్తలు

కడప జిల్లా రాజంపేట మండలం రోళ్లమడుగు వద్ద మినీలారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 14 మందికి గాయాలు కాగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్‌రెడ్డి తన వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించారు.

Minilorry roll over at Rollamadugu
రోళ్లమడుగు వద్ద మినీలారీ బోల్తా

By

Published : Sep 11, 2020, 10:19 AM IST

Updated : Sep 11, 2020, 12:11 PM IST

టెంపు బోల్తా పడిన సంఘటనలో 14 మందికి తీవ్రగాయాలు కాగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కడప జిల్లా రాజంపేట మండలం రాయచోటి మార్గంలోని రోళ్లమడుగు ప్రాంతంలో జరిగింది. పెనగలూరు మండలం సింగనమల, కంబాలకుంట గ్రామాలకు చెందిన కూలీలు సుండుపల్లెలో మామిడికాయలను కోయడానికి టెంపోలో బయలుదేరారు. రోళ్లమడుగు ప్రాంతంలో టెంపో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 14 మంది గాయపడ్డారు. అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి వారందరినీ దగ్గరుండి తన వాహనంలో, 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్న వారిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Sep 11, 2020, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details