ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వాళ్ల మాట వినకుంటే కొడుతున్నారు సార్.. కాపాడండి' - ప్రొద్దుటూరులో పాల వ్యాపారుల వార్తలు

కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇళ్లకు వెళ్లి పాలు పోయకూడదని పోలీసులు తమను బెదిరిస్తున్నట్టు పాల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. వారు చెప్పిన కంపెనీకి పాలు పోయకుంటే.. లాఠీలతో తమను చితకబాదుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు.

milk farmers problems
milk farmers problems

By

Published : Apr 30, 2020, 7:08 PM IST

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో పాల వ్యాపారులు ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు. లాక్​డౌన్ కారణంగా ఇళ్ల వ‌ద్ద పాలు పోసేందుకు పోలీసులు అనుమ‌తి ఇవ్వట్లేదన్నారు. కొన్ని చోట్ల ఇళ్ల వ‌ద్ద‌కు పాలు తీసుకెళ్లే వ్యాపారుల‌ను పోలీసులు లాఠీల‌తో కొడుతున్నారని ఆరోపించారు. తాము సేక‌రించిన పాల‌ను ప‌ట్ట‌ణంలోని శ్రీనిధి కంపెనీకి పోయాల‌ని పోలీసులు చెబుతున్నారని అన్నారు.

ఏళ్ల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పాల‌ను సేక‌రించి ప‌ట్ట‌ణాల్లో ఇళ్ల వ‌ద్ద‌కు వెళ్లి పోస్తున్నామ‌ని.. ఇప్పుడు శ్రీనిధి కంపెనీకి పోయాలంటే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విషయంపై మాన‌వ హ‌క్కుల క‌న్వీన‌ర్ జ‌య‌శ్రీ, సీపీఐ నాయ‌కుల‌తో క‌లిసి లూజుపాల వ్యాపారులు ప్రొద్దుటూరు డిప్యూటీ త‌హ‌సీల్దారుకు విన‌తి ప‌త్రం అందించారు. త‌మ‌కు న్యాయం చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details