కడప జిల్లాలో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్ వలస కార్మికులు.. స్వరాష్ట్రానికి బయల్దేరారు. రెవెన్యూ కార్యాలయం వద్ద ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి జెండా ఊపి బస్సులు ప్రారంభించారు. మొత్తంగా 269 మంది వలస కార్మికులను అధికారులు.. 6 బస్సుల్లో కడప రైల్వే స్టేషన్కు తరలించారు.
విపత్కర పరిస్థితుల్లో తమను ఆదరించి.. సహయ సహకారాలు అందించి.. తమను స్వస్ధలాలకు పంపేందుకు కృషి చేసిన ప్రభుత్వ అధికారులకు, పాలకులకు, దాతలకు వలస కార్మికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.