ఒడిశాకు చెందిన 33 మంది వలస కూలీలను ప్రత్యేక బస్సులో భౌతికదూరం పాటిస్తూ రాయచోటి నుంచి కడప వరకు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక రైలులో వారి స్వస్థలాలకు తరలిస్తామని అధికారులు తెలిపారు. ఇన్ని రోజులు తమను సొంత వారిలా ఆదరించిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన రాష్ట్రాల వారిని రెండు రోజుల్లో తరలిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
స్వస్థలాలకు వలస కూలీలు - స్వస్థలాలకు వలస కూలీలు
లాక్డౌన్ కారణంగా కడప జిల్లాలో చిక్కుకున్న వలస కూలీలను అధికారులు స్వస్థలాలకు పంపించారు. రాయచోటి, రాజంపేట నుంచి ఆర్టీసీ బస్సుల్లో కడపకు తరలించిన అధికారులు... అక్కడి నుంచి ప్రత్యేక రైళ్లలో స్వరాష్ట్రానికి పంపించారు.
రాజంపేటలో వివిధ వృత్తుల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఉత్తరప్రదేశ్ వలస కూలీలను అధికారులు స్వస్థలాలకు పంపించారు. రాజంపేట నుంచి నాలుగు ఆర్టీసీ బస్సుల్లో 102 మంది వలస కార్మికులు కడప రైల్వే స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలులో వలస కూలీలు స్వరాష్ట్రానికి చేరుకుంటారు.