ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కువైట్ నుంచి రాయచోటికి వలస కార్మికులు - kuwait migrants workers latest news

లాక్​డౌన్​తో కువైట్​లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన కొంతమంది వలస కార్మికులు స్వదేశానికి చేరుకున్నారు. రాయచోటి శివారులోని ఓ క్వారంటైన్​ కేంద్రానికి వారిని అధికారులు తరలించారు. శనివారం వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.

కువైట్ నుంచి రాయచోటికి చేరుకున్న వలస కార్మికులు
కువైట్ నుంచి రాయచోటికి చేరుకున్న వలస కార్మికులు

By

Published : Jun 20, 2020, 12:23 AM IST

జీవనోపాధి కోసం కువైట్​కు వలస వెళ్లిన కార్మికులు... తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్న కార్మికులను.... అధికారులు ప్రత్యేక బస్సుల్లో కడప జిల్లాలోని రాయచోటికి తీసుకొచ్చారు. పట్టణ శివారులోని మాసాపేట ఎస్టీ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో కార్మికులు 14 రోజుల పాటు ఉంటారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. శనివారం వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని నోడల్ అధికారి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కువైట్ నుంచి వచ్చిన వారిలో 70 మంది పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. వారికి వేర్వేరుగా వసతి ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details