ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కువైట్ నుంచి జిల్లాకు చేరుకున్న వలస కూలీలు - migrant workers came kuwait to kadapa

జీవనోపాధి లేక కుటుంబ పోషణ కోసం పొట్ట చేత పట్టుకుని కువైట్ వెళ్ళిన కడప జిల్లా వాసులు అష్టకష్టాలు పడి చివరకు సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. రెండు విమానాల్లో చెన్నైకి వచ్చినవారికి అధికారులు జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.

కువైట్ నుంచి జిల్లాకు చేరుకున్న వలస కూలీలు
కువైట్ నుంచి జిల్లాకు చేరుకున్న వలస కూలీలు

By

Published : Jun 7, 2020, 2:27 PM IST

కువైట్ నుంచి రెండు విమానాల్లో చెన్నైకి చేరుకున్న కడప జిల్లా వలస కూలీలు ప్రత్యేక బస్సుల్లో జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు చేరుకున్నారు. తొలి విమానంలో వచ్చిన 290 మంది రాగా రెండో విమానంలో 250 మంది కడపకు చేరుకున్నారు. వీరి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఈ ఏర్పాట్లను ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి పర్యవేక్షించారు.

ABOUT THE AUTHOR

...view details