తిండి కరువైంది సారూ... స్వస్థలాలకు పంపించండి - uttarpradesh migrant workers news in telugu
పొట్టకూటి కోసం వేల కిలోమీటర్లు దాటి రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తినడానికి తిండి లేక... ఉన్న ఇంటికి అద్దే కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. సొంత ఊళ్లకు వెళ్దామంటే ప్రజారవాణా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. కూలి పనుల కోసం కడపకు వచ్చి లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీల దయనీయ పరిస్థితి ఇది.
కూలి పనుల కోసం వచ్చి లాక్డౌన్ వల్ల కడపలో చిక్కుకు పోయామని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 రోజుల నుంచి పనులు లేక ఖాళీగా ఉంటున్నామని వాపోయారు. తినేందుకు తిండి కూడా లేదని గోడు వెల్లబోసుకున్నారు. చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతున్నామంటూ... జిల్లా అధికారులు తమను ఉత్తరప్రదేశ్‌కు తరలించాలని వేడుకుంటున్నారు. అధికారులు స్పందించాలని... లేదంటే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని కన్నీటిపర్యంతమయ్యారు. ఉన్న ఇంటికి అద్దెలు చెల్లించకపోవటంతో యజమానులు ఖాళీ చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.