ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలెక్టరేట్​ను ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు, ఏఎన్​ఎంలు - కడప కలెక్టరేట్

కడప జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలంటూ ఏఎన్​ఎంలు మరోపక్క నిరసన వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులు పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం లేవనెత్తుతామని స్పష్టం చేశారు.

midday meals workers protest at kadapa collectorate, anms agitation at collectorate
కలెక్టరేట్​ను ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు, కలెక్టరేట్ వద్ద ఏఎన్​ఎంల నిరసన

By

Published : Apr 19, 2021, 9:46 PM IST

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి హెచ్చరించారు. వారి ఇబ్బందులకు పరిష్కారాన్ని కోరుతూ.. కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని.. ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను పెంచాలని కోరారు. 2020 నుంచి పెండింగ్​లో ఉన్న బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలలో వంట గది, పాత్రలు, గ్యాస్ సిలిండర్లు సమకూర్చాలన్నారు. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు.

ఇదీ చదవండి:18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి టీకా

ఏఎన్ఎంల సమస్యల పరిష్కారం కోసం.. కడప కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ 48 గంటల పాటు ధర్నా చేపట్టారు. రేపు ఉదయం 10 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఏఎన్ఎంలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఏకాంతంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details