ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులను కష్టాల కొలిమిలోకి నెట్టిన మిగ్​జాం - ఆరుగాలం పండించిన పంట వర్షార్పణం - Michaung cyclone

Michaung Cyclone Affected Farmers : తుపాను కారణంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తుపాను తాకిడికి నేల మట్టం అయ్యిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

michaung_cyclone_in_ap
michaung_cyclone_in_ap

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2023, 5:11 PM IST

Updated : Dec 5, 2023, 5:34 PM IST

Michaung Cyclone Affected Farmers :మిగ్ జాం తుపాను కారణంగా పలు జిల్లాల వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. ఈ తుపాను రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. వరి పంటలు నేలవాలయి. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు లబోదిబోమంటున్నారు.
కడపను వణికిస్తున్న తుపాను - ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు

Michaung Cyclone Affected Kadapa : ఉమ్మడి కడప జిల్లాలో మింజాం తుపాను బీభత్సం సృష్టించింది. రాజంపేట, ఒంటిమిట్ట, సిద్ధవటం, పెనగలూరు, పుల్లంపేట మండలాల్లో ఉద్యాన పంటలకు అపారనష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో అరటి, బొప్పాయి పంటలు నీట మునిగాయి. అకేపాడు ప్రాంతాలలో పూల తోటలు నీట మునిగాయి. ఒక్క రాజంపేట మండలంలోని 1500 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. తుపాను కారణంగా మునగా, తమలపాకు తోటలకు కూడా భారీగా నష్టం వచ్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తుపాను తాకిడికి బుగ్గిపాలైందని రైతులు వాపోతున్నారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం, అధైర్యపడొద్దు : మంత్రి కారుమూరి

Cyclone Affected Various District :బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో భారీ ఈదురు గాలులతో చెట్లు నేల కులాయి. పలు ప్రాంతాల్లో స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వేల ఎకరాల్లో వరి నీటమునిగింది. పంట చేతికి వచ్చే సమయంలో తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొలాలు నీట మునిగాయి. వందలాది ఎకరాల్లో వరి పంట నేల వాలింది. అరటి, పొగాకు తోటల్లోకి వరద చేరింది.

గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. వందల ఎకరాల్లో శనగ, వరి పంటలు నీట మునిగాయి. దుగ్గిరాల మండలంలో వందలాది ఎకరాల్లో వరి నేల వాలింది. దీంతో రూపాయి చేతికి వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు వాపోతున్నారు

నెల్లూరు జిల్లాలో సుమారు పది వేల ఎకరాల్లో వరి నాట్లు, నారు మళ్లకు నష్టం వాటిల్లింది. కావలి, దగదర్తి, అల్లూరు, వెంకటాచలం, కోవూరు, టీపీ గూడూరు తదితర మండలాల్లో పలు పొలాలు నీట మునిగాయి. దీంతో పాటు 50 వేల హెక్టార్లలో వేరుశనగ మునిగిపోయింది. పంట దక్కడం కష్టమని రైతులు ఆవేదనా వ్యక్తం చేస్తున్నారు. 210 హెక్టార్లలో మిరప, బొప్పాయి, కూరగాయల పొలాల్లో నీరు నిలిచింది. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాదని ఆవేదనా చెందుతున్నారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులు ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

తుపాను ప్రభావంతో నేలకొరిగిన పంటలు - నష్టాల్లో ఏలూరు జిల్లా రైతులు

Last Updated : Dec 5, 2023, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details