కడప జిల్లా రైల్వే కోడూరు మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులను కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. కార్మికులంతా భౌతిక దూరం పాటించాలని, పనికి వెళ్లే ముందు, వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి సూచించారు.
ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కూలీల సమస్యలు తెలుసుకున్నారు. పని చేసిన ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తున్నారా లేదా అన్నది ఆరా తీశారు. కూలీలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.