2018-19 సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.2,450 కోట్ల బిల్లులను చెల్లించాలంటూ.. ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు. తెదేపా కడప కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బిల్లుల చెల్లింపులో వైకాపా ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో.. కేవలం పులివెందుల, చిత్తూరుకే ఉపాధి హామీ బిల్లులు చెల్లించారని కౌన్సిల్ సభ్యుడు గురుమూర్తి పేర్కొన్నారు. కేంద్రం తన వాటా విడుదల చేసినా.. సీఎం జగన్ ఆ నిధులను ఆయన పథకాలకు ఉపయోగించుకున్నారని ఆరోపించారు. న్యాయంగా రావాల్సిన ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలని.. లేదంటే దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
'పులివెందుల, చిత్తూరుకే నిధులు విడుదల చేశారు' - కడప తెదేపా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు
తెదేపా కడప కార్యాలయంలో.. ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. బకాయి బిల్లులకు నిధులు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పులివెందుల, చిత్తూరుకు మాత్రమే విడుదల చేసి.. మిగతా 173 నియోజకవర్గాలకు మొండిచేయి చూపారని కౌన్సిల్ సభ్యుడు గురుమూర్తి ఆరోపించారు.
సమావేశంలో పాల్గొన్న ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు