చేతివృత్తులను ప్రోత్సహించటం వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని కడప నగరపాలక కమిషనర్ లవన్న అన్నారు. కడప వైఎస్ఆర్ ఆడిటోరియంలో మెప్మా బజార్ ను ప్రారంభించారు. మహిళలు తయారు చేసిన హస్తకళలను పరిశీలించారు. ఆరోగ్యానికి మేలుచేసే పిండి వంటలను కమిషనర్ కొనుగోలు చేశారు. మెప్మా బజార్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ స్థానంలో పేపర్ కవర్లను తయారుచేసిన మహిళలను అభినందించారు. చేతివృత్తుల ద్వారా ఎంతోమంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు. మహిళలకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చేతివృత్తుల్లో మహిళలు రాణించాలని... అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు.
చేతి వృత్తులతో ఎంతో మందికి ఉపాధి - ladies
కడప వైఎస్ఆర్ ఆడిటోరియంలో మెప్మా బజార్ ఏర్పాటు చేశారు. నగరపాలక కమిషనర్ లవన్న హాజరై ప్రారంభించారు.
మెప్మాబజార్