తల్లి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుసుకున్న ఓ కొడుకు ఆమె కంటే ముందే చనిపోవాలని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప చిన్నచౌకు ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. కడప శ్రీరాంనగర్‌కు చెందిన గోర్ల సునీల్‌కుమార్(35)కు అయిదేళ్ల కిందట వివాహమైంది. మూడేళ్ల కిందట భార్య నుంచి విడిపోయాడు. ఇంటి వద్దనే తల్లి ఆనందమ్మతో కలిసి ఉంటున్నాడు. కొద్దిరోజుల కిందట సునీల్‌కుమార్‌కు జ్వరం రావడంతో అప్పటి నుంచి మానసిక పరిస్థితి సరిగా లేదు. ఇటీవల ఆనందమ్మ అనారోగ్యానికి గురవడంతో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. తల్లి మరణాన్ని చూసి తట్టుకోలేనని ఆమె కంటే ముందే చనిపోవాలని నిర్ణయించుకుని శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తల్లికి అనారోగ్యం.. కుమారుడు ఆత్మహత్య - కడపలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
అనారోగ్యానికి గురైన తన తల్లికి ఏమవుతుందోననే మనోవేదనతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది.
![తల్లికి అనారోగ్యం.. కుమారుడు ఆత్మహత్య men suicide in kadapa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13235696-93-13235696-1633137507339.jpg)
men suicide in kadapa