కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బాలపల్లి చెక్ పోస్ట్ సమీపంలో మోటార్ సైకిల్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి.. మరొకరికి గాయాలు - బాలపల్లి చెక్ పోస్ట్ సమీపంలో మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన కారు
మోటర్ సైకిల్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. కడప జిల్లా బాలపల్లి చెక్‌పోస్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి.. మరొకరికి గాయాలు
బాలపల్లికి చెందిన శ్రీహరి బాబు (55) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. రేణిగుంట నుంచి కడప వైపు వెళ్తున్న కారు మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీహరి బాబు అక్కడికక్కడే మృతి చెందారు. అదే ప్రమాదంలో కారు బోల్తాపడటంతో అందులోని వ్యక్తి గాయపడ్డారు. మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి శవ పంచనామా కోసం తరలించామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.