Mekapati Chandrasekhar Reddy Allageations on Jagan:ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి కూడా మంచి పాలన అందించారని, జగన్ ఆయనకు కొడుకు ఎలా అయ్యాడో అర్థం కావడంలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో తనకు టికెట్ లేదని జగనే పొగ పెట్టి పంపించి వేశారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ నా గ్రాఫ్ బాలేదంటూ కించపరిచాడు - నా టిక్కెట్ అమ్మకానికి పెట్టాడు : మేకపాటి వీరారెడ్డి 23వ వర్ధంతి సభ: వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి బిజీవేముల వీరారెడ్డి 23వ వర్ధంతి సభను ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వీరారెడ్డి కుమార్తె మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ నేత రితేష్ రెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతి సభ జరిగింది. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనం రామనారాయణరెడ్డి తో పాటు కడప జిల్లాకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఇతర నేతలు హాజరయ్యారు. వీరారెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు. ఆయన నిజాయితీ గల నాయకుడని ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
జగనన్నా ఏదీ జాబ్ క్యాలెండర్? - నెల్లూరులో విద్యార్థుల వినూత్న నిరసన
అన్యాయాలను ఇక భరించలేం: జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, జగన్ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరని జ్యోష్యం చెప్పారు. సీఎం పదవి భగవంతుడు ఇచ్చిన వరమని, జగన్ లాంటివారు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ప్రజలు బాగుపడరని విమర్షలు గుప్పించారు. గతంలో జగన్ కోసం బద్వేలులో బాగా పనిచేశానని తెలిపారు. కానీ, ఇప్పుడు మాత్రం టీడీపీకి అన్ని జిల్లాల్లో మంచి స్పందన వస్తోందని, ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం రాకుంటే మనం గుండు కొట్టుకోవాల్సి వస్తుందని తెలిపారు. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే కేసులను, అన్యాయాలను ఇక భరించలేమని పేర్కొన్నారు.
కుర్చీ వేయరు, నిధులు ఇవ్వరు - దళిత సర్పంచ్‌కు అవమానం
వైసీపీ బలోపేతం కోసం ఎంతో శ్రమించా: తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, నా గ్రాఫ్ బాలేదంటూ సీఎం జగన్ నన్ను కించపరిచారని మేకపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయగిరిలో నేను డబ్బు తీసుకుంటున్నానని జగన్ అన్నారని, అసలు ఉదయగిరిలో ఏముందని నేను సంపాదించడానికి? అని మేకపాటి ప్రశ్నించారు. వైసీపీ బలోపేతం కోసం ఎంతో శ్రమించానని, అలాంటి నాపై లేనిపోని అనుమానాలతో నా టికెట్‌నే జగన్ అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. వైఎస్‌పై ప్రజలకున్న అభిమానంతోనే జగన్ సీఎం అయ్యారన్న మేకపాటి, జగన్ లాంటి వ్యక్తి సీఎంగా ఉంటే రాష్ట్రం శ్మశానం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న వనరుల సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, బటన్లు నొక్కడమే పనిగా పెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఎలా? అంటూ ప్రశ్నించారు. జగన్ చుట్టూ ఉండే సలహాదారులు ఎవరికివారు దోచుకునేవాళ్లే అని మేకపాటి విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురవేయాలని, తద్వారా రాష్ట్రంలో తెలుగుదేశంలో అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు.
Suspended YCP MLA Mekapati Chandrasekhar Reddy Comments: త్వరలో టీడీపీలో చేరుతా.. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి