కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువతీ యువకులకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో దిశ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన దిశ చట్టంపై ప్రతీ ఒక్కరికీ తెలియజేసి చైతన్యం తీసుకురావాలని రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. దిశ చట్టం, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఇవి ప్రతి పాఠశాలలో బాలికలకు క్షుణ్ణంగా వివరించాలని ఐసీడీఎస్ సీపీడీవో నిర్మల చెప్పారు. ఈ చట్టం వల్ల అన్యాయం జరిగిన మహిళలకు తక్షణ న్యాయం జరుగుతుందన్నారు.
రాజంపేటలో దిశ చట్టంపై విద్యార్థులకు అవగాహన సదస్సు - disha act meeting in rajampeta
దిశ చట్టంపై కడప జిల్లా రాజంపేటలో ఐసీడీఎస్ అధికారులు డిగ్రీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ చట్టం గురించి పూర్తిగా తెలుసుకొని పాఠశాలలో బాలికలకు అవగాహన కల్పించాలని ఐసీడీఎస్ సీపీడీవో నిర్మల విద్యార్థులకు సూచించారు.

'దిశ చట్టాన్ని విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి'
దిశ చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఐసీడీఎస్ అధికారులు
ఇదీ చదవండి: