ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మీ సేవ'లను బతికించాలంటూ నిర్వహకుల ఆందోళన - meeseva operaters concern is to survive 'your services' newsupdates

ప్రభుత్వ విధానాలతో నిర్వీర్యమవుతున్న 'మీ సేవ'లను బతికించాలంటూ కడప, చిత్తూరు జిల్లాలో  మీ సేవ నిర్వహకులు ఆందోళన చేపట్టారు.

latestnews meeseva operaters concern is to survive 'your services'
'మీ సేవ'లను బతికించాలంటూ నిర్వహకుల ఆందోళన

By

Published : Jan 3, 2020, 11:58 PM IST

'మీ సేవ'లను బతికించాలంటూ నిర్వహకుల ఆందోళన

చిత్తూరు జిల్లాలో..
పీలేరు పట్టణంలో మీ సేవ కేంద్రాల నిర్వహకులు, ఆపరేటర్లు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. 15 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని వాపోయారు. 15 ఏళ్లుగా వందల కుటుంబాలు మీసేవ కేంద్రాలపై ఆధారపడి జీవిస్తున్నాయని అన్నారు. మీసేవలో అమలవుతున్న సర్వీసులను గ్రామ సచివాలయానికి మార్పు చేయటంతో ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. మీసేవ నిర్వహకుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

కడప జిల్లాలో..
తమకు న్యాయం చేయాలని కడప జిల్లా కలెక్టరేట్ ముందు మీ సేవ నిర్వహకుల అసోసియేషన్ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో అన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాలను నిర్వహిస్తున్న ఆపరేటర్లను గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్​గా నియమించాలని విజ్ఞప్తి చేశారు. మీ సేవ నిర్వహకుల దీక్షలకు సంఘీభావం తెలుపుతూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

nirasana

ABOUT THE AUTHOR

...view details