వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అవమానపరిచే విధంగా ఆ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కరరావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైద్య ఆరోగ్య సిబ్బంది నిరసనకు దిగారు. కడప జిల్లా రాజంపేటలోని వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రి ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. ఇటీవల జూమ్ యాప్ ద్వారా జరిగిన సమావేశంలో వైద్య సిబ్బంది ఎవరు సక్రమంగా పని చేయలేదంటూ చెప్పుకోలేని భాషలో అవమానపరిచే విధంగా మాట్లాడారని ఎంపీహెచ్ఓ, సీహెచ్ఓ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి పిచ్చయ్య ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా నేపథ్యంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది నిరంతరం పని చేస్తుంటే… ఆ శాఖ కమిషనర్ మాత్రం ఎవరు పని చేయలేదంటూ విమర్శించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట వైద్య విధాన పరిషత్ సూపరింటెండెంట్ డాక్టర్. మాధవ్ కుమార్ రెడ్డి, ఎన్జీవో సంఘం తాలూకా అధ్యక్షుడు ఎస్వీ రమణ తదితరులు పాల్గొన్నారు.
'హెల్త్ కమిషనర్ మమ్మల్ని అవమానించారు' - హెల్త్ కమిషనర్ కాటమనేని భాస్కరరావు అనుచిత వ్యాఖ్యలు వార్తలు
హెల్త్ కమిషనర్ తమను అవమానపరిచేలా మాట్లాడారంటూ కడప జిల్లా రాజపేటంలో వైద్యసిబ్బంది ధర్నా నిర్వహించారు. వైద్య సిబ్బంది ఎవరు సక్రమంగా పని చేయలేదంటూ విమర్శించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
హెల్త్ కమిషనర్ అవమానపరిచేలా మాట్లాడంటూ రాజపేటంలో వైద్యసిబ్బంది ధర్నా